సైకిల్ తొక్కిన విప్.. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఆలేరు కాంగ్రెస్లీడర్లు స్వాగతం 

సైకిల్ తొక్కిన విప్.. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఆలేరు కాంగ్రెస్లీడర్లు స్వాగతం 

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు :  పెట్రోల్​ ఉత్పత్తుల రేట్ల పెంపునకు నిరసనగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైకిల్​ తొక్కారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నర్సింహస్వామి పాదాల వద్ద నుంచి అయిలయ్య సైకిల్​ తొక్కడం ప్రారంభించారు. అక్కడి నుంచి వంగపల్లి, రామాజీపేట, పెద్ద కందుకూరు మీదుగా ఆలేరుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్​ లీడర్లు స్వాగతం పలికారు. 

ఆలేరు మార్కెట్​ యార్డు, కొలనుపాకలోని వడ్ల కొనుగోలు సెంటర్ల​ను సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. కొనుగోలు ఆలస్యంగా జరుగుతోందని రైతులు తెలపడంతో కలెక్టర్​ అనురాగ్​ జయంతిని ఆరా తీశారు. వెంటనే కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని, లారీలు పంపించి మిల్లులకు వడ్లను తరలించాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్​ రేట్ల పెంపు వలన సామాన్య ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నాయని, నిత్యవసర రేట్లు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రో ఉత్పత్తుల రేట్లు తగ్గించాలని డిమాండ్​ చేశారు.